News

జమ్ములో దారుణం… లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి!

340views

జమ్ముకశ్మీర్​లోని కూప్వారా జిల్లాలోని మచ్​హల్ సెక్టార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద దట్టమైన పొగ మంచు కారణంగా జవాన్ల వాహనం అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు బుధవారం తెలిపారు. “పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు ఉన్న వాహనం లోయలోకి పడింది. ట్రాక్​పై దట్టమైన మంచు కురవడం వల్లే ఈ ఘటన జరిగింది” అని శ్రీనగర్‌ పోలీసులు ట్వీట్​ చేశారు.