News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

217views

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతోపాటు పలు రాజకీయ కార్యక్రమాలు కూడా మోదీ పర్యటనలో భాగంగా ఫ్లాన్ చేశారు. అయితే వేరే ప్రొగ్రామ్స్ వల్ల ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలియవచ్చింది. ఈ నెల 19న‌ సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలు ను ప్రధాని ప్రారంభించడంతోపాటు సికింద్రాబాదు- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమాలతోపాటు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. మోదీ పర్యటన వాయిదా పడటంతో ఈ పనులన్నీ వాయిదా వేసినట్లు సమాచారం. కొద్ది రోజుల తర్వాత ప్రధాని పర్యటన ఎప్పుడనేది తేదీలు ప్రకటించనున్నారు.