News

రేపే శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల విడుదల!

366views

జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి కోటా (ఫిబ్రవరి 1 నుంచి 22) కు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను ఈ నెల 7న ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ ప్రత్యేక దర్శన స్లాట్లకు సంబంధించిన గదుల బుకింగ్ ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 2 నుంచి 11 వరకు అందుకు సంబంధించిన టికెట్లను టీటీడీ జారీ చేసింది.