News

ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం!

350views

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. పైలట్​ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్​కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్​హటా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్​ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్లేన్ పల్టాన్​ ట్రెనింగ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.