News

కళ తప్పిన పవిత్ర సంగమ ప్రాంతం.. నిలిచిపోయిన హారతులు!

197views

విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమాన్ని అందరూ పవిత్రంగా భావిస్తుంటారు. గతంలో ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేసింది. పవిత్ర సంగమం నుంచే దుర్గమ్మకు.. హారతులు అందజేసేవారు. నిత్యం జరిగే హారతిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ప్రస్తుతం పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని నిలిపివేయడంతో.. ఇక్కడకు వచ్చే పర్యాటకుల తాకిడి తగ్గింది. నిర్వాహణ లేక పవిత్ర సంగమం కళ తప్పింది. నదిలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మెట్లు బురదమయంగా మారాయి. అతిథి గృహాలు నిరుపయోగంగా మారిపోయాయి. పవిత్ర సంగమ ప్రాంతం నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని.. హారతి సౌకర్యం కల్పించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.