News

శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు .. కారణం ఇదే!

360views

తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే తెలిపింది. తిరుమల శ్రీవారిని బుధవారం 61,116 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,004 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చింది.