News

గోవా ఎయిర్​పోర్టుకు పారికర్ పేరు

344views

 

గోవాలోని మోపా విమానాశ్రయానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ పేరు పెట్టేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌’గా నామకరణం చేస్తూ కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయాన్ని 2022 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆధునిక గోవాను నిర్మించడంలో దివంగత మనోహర్ పారికర్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ విమానాశ్రయానికి ఆయన పేరును త్వరలో పెట్టనున్నారు.