News

బడ్జెట్​పై కేంద్రం కసరత్తు.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ

336views

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​పై కసరత్తులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ సహాయ మంత్రులు పంకజ్​ చౌదరీ, భగవత్​ కిషన్​రావ్​, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది ఆర్థిక శాఖ.

ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసే అంశాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​. జీఎస్టీ, ఆదాయపు పన్నును హేతుబద్ధీకరించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కల్పన, సామాజిక మాళిక సదుపాయల పెంపు, పరిశ్రమల సామర్థ్యం పెంపు, భారత ఆర్థిక ప్రగతితో కూడిన ఐదు అంశాల ప్రణాళికను అందజేశారు పారిశ్రామికవేత్తలు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే పద్దు మోదీ ప్రభుత్వానికి చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి