News

నంద్యాల, ఆళ్ళగడ్డలో ఘనంగా ఆయుర్వేద దినోత్సవం

509views

నంద్యాల: స్థానిక ‘ఆరోగ్యం భారతి’ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని, స్థానిక శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో ఆయుర్వేద దినోత్సవం, నడకతో ఆరోగ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆరోగ్య భారతి,అఖిల భారతీయ ప్రముఖ డాక్టర్ మురళీకృష్ణ ప్రధాన వక్తగా విచ్చేశారు. స్థానిక డీఎస్సీ పి.మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం విశిష్టతను, జీవవైవిధ్యంగల దేశంలో ఆయుర్వేదం ప్రాముఖ్యతను, అనుకూలతలను వివరించారు. అనాది నుండి ఆయుర్వేదం ప్రత్యేక వైద్య విధానంగా కంటే జీవన విధానంలో, సంస్కృతీ సాంప్రదాయాల్లో భాగంగా విరాజిల్లిందని తెలిపారు. అనంతరం వైద్యులు, ప్రముఖులు, విద్యార్థులు పురవీధుల మీదుగా బానర్లు, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వైద్యులకు ఘనంగా సత్కరించారు. ఆయుష్ విభాగం డాక్టర్లు, డాక్టర్ యశోధర, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ యం.డి.వి.యన్. రామశర్మ, వారి సిబ్బంది ఆరోగ్య భారతి ప్రాంత కార్యదర్శి డాక్టర్ వి. పరమేశ్వర రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ప్రముఖ ఆయర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్, డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ కాదల్ బాద్ ఉదయ్ శంకర్ పాఠశాల విద్యార్థులు, యువకులు, పెద్దలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నా రు.

ఆళ్ళగడ్డలో….

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆయుర్వేద దినోత్సవంలో డాక్టర్ ఆర్. మురళీ కృష్ణ, ఆరోగ్య భారతి, ప్రాంత కార్యదర్శి డాక్టర్ యం డివియన్ రామశర్మ పాల్గొని ప్రసంగించారు. సీనియర్ వైద్యురాలు, డాక్టర్.సీతా కల్యాణిని సన్మానం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి