News

‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’

319views

వాషింగ్టన్‌: గ్లోబల్‌ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 ఏడాది కీలకంగా నిలిచిందని తెలిపారు. వచ్చే ఏడాది ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని అన్నారు. ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల ముగిసిన G-20 సదస్సు సందర్భంగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో మోదీ చేసిన వ్యాఖ్యలు కీలక పాత్ర పోషించాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి