
220views
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్ గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్ నేపథ్యంలో ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ వ్యాక్సిన్, ఎన్ని డోసులు , ఎప్పుడెప్పుడు వేయించుకున్నారన్న దానిని కూడా పత్రంలో కచ్చితంగా నింపాలి. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలను అందులో పొందుపరచాలి. తాజాగా ఈ నిబంధనను భారత్ ఎత్తివేసింది. అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను ఇటీవల కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.