
విజయవాడ: దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పురోభివృద్ధి సాధించాలని పలువురు వక్తలు సూచించారు. నగరంలోని సత్యనారాయణపురంలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా దివ్యాంగుల సమ్మేళనం ఘనంగా జరిగింది. సక్షమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు, వారు తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ‘భవిత’ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో వక్తులు మాట్లాడుతూ దివ్యాంగులు అభివృద్ధి నిమిత్తం పలు సంస్థలు, ప్రభుత్వాలు కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, కుల వృత్తులు వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. దివ్యాంగుల సమస్యలపై అవగాహన కలిగిస్తూ నగర వీధులలో శోభయాత్ర జరిపారు. సక్షమ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామారావు, ఫౌండేషన్ ప్రతినిధి రామాంజనేయులు, తారనాథ్, మూర్తి, కృష్ణమోహన్, గీత, సీతా మహాలక్ష్మి, రామారావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.







