
55views
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు విజయ్ నాయర్ రేమండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది.
ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ నివాసంలోనే విజయ్‌నాయర్ బస చేశారని, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా అధికారులకు విజయ్‌నాయర్ పరిచయం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయ్‌నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని ఈడీ స్పష్టం చేసింది.
హోల్ సేల్ అమ్మకందారుల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని వివరించింది. ఈ రూ. 100 కోట్ల ముడుపుల్లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దేశ రాజధానికి తరలించాడని పేర్కొంది.
Source: Nijamtoday