బాలికపై డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్ లైంగిక దాడి.. వేగంగా వెళ్తున్న ఆటోలోంచి దూకిన బాలిక..(వీడియో)

ఔరంగాబాద్: తన ఆటోలో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. దీంతో వెంటనే ఆ బాలిక ఆటోలోంచి దూకింది. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని, ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్ పుర ప్రాంతంలో ఒక బాలిక తన ఇంటికి వెళ్ళేందుకు ఆటో ఎక్కింది.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్ అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. అనంతరం బాలికతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఏం చేయాలో తెలియక, అతడ్నుంచి తప్పించుకునేందుకు వేగంగా వెళ్తున్న ఆటోలోంచి దూకేసింది. రోడ్డుపై పడిపోయిన బాలికకు గాయాలయ్యాయి. వెంటనే పక్కనుంచి వెళ్తున్న కొందరు వాహనదారులు ఆగి ఆమెకు సాయం అందించారు. పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ సయ్యద్‌ను అరెస్టు చేశారు. కాగా, బాలిక ఆటోలోంచి కింద పడటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. బాలిక కిందకు దూకినప్పటికీ, ఆటో డ్రైవర్ ఆగకుండా అలాగే వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, రద్దీగా ఉండే రోడ్డుపైకి దూకిన బాలిక ఆత్మస్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





