
369views
న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు చెందిన గూఢచార సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ హనీట్రాప్ చేసిందని తెలిపారు. పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు.. భద్రతా దళాల సాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.





