News

వైభవంగా అయ్యప్పస్వామి పడిపూజ

377views

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా, రాజానగరంలో శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. అక్కడి వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా 108 సైకత శివలింగాల మధ్య ఆది దంపతుల భారీ సైకత శిల్పాన్ని సుమారు 30 అడుగుల వెడల్పుతో రూపొందించారు. సైకత శిల్ప రూపకర్త శ్రీనివాస్ తన ఇద్దరు కుమార్తెలు కలిసి.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘ప్రకృతిని ప్రేమిద్దాం’ అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని సుమారు 16 గంటల సమయంలో ఆరు యూనిట్ల ఇసుకతో రూపొందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి