
506views
నంద్యాల: స్థానిక సంఘమిత్ర ఆవాసంలో మాతృమిత్ర, సేవికా సమితి కార్యకర్తలు, సంఘమిత్ర చిన్నారులతో కలిసి సమాజానికి శ్రేష్ఠ సంప్రదాయాలను పరిచయం చేయడంలో మేలు బంతిలో ఉంటారు. దేవీ నవరాత్రుల సందర్బంగా బొమ్మల కొలువు, పూజలు, భజనలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఏర్పాటు చేసి సమాజంలో సనాతన ఆధ్యాత్మిక సారస్వత సౌరభాలు నింపిన విషయం పాఠకులకు విదితమే. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సేవికా సమితి కార్యవర్గ సభ్యులు వైఎస్ సంధ్య, విజయశ్రీ, వెంకటేశ్వరి, సునంద, గాయత్రి తదితర సేవికా సమితి కార్యకర్తలు దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంప్రదాయం అంతరార్థాన్ని ఆహుతులకు వివరించారు.






