
392views
న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని… దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. దేశంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని లాయర్ ఆశ్విని కుమార్ పిటిషన్ వేశారు.





