News

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!

385views

న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. 18 రోజులపాటు అర్ధరాత్రి వెళ్ళి ఆ ముక్కలను ఒక్కోచోట పడేసి వచ్చాడు. ఆరు నెలల తర్వాత చివరికి నిందితుడు పోలీసులకు చిక్కాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి