News

రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు

345views

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు జరిగాయి. మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్​జీ మహరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీతో మఠం కిటకిటలాడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి