News

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తిక దీపోత్సవం

386views

జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరించారు. తిరుపతమ్మ, గోపయ్య స్వాముల అంతరాలయం, ఆలయంలో కొలువుదీరిన సహదేవతల ఆలయాలను దీపాలతో అలంకరించి పూజలు చేశారు. ప్రత్యేకమైన దీపాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాల మండపంలో భక్తులు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి