
కశ్మీర్: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
1947 అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యంలోని పదాతి దళం శ్రీనగర్ విమానాశ్రయంలో దిగింది. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన పదాతి దళం శివార్ల నుంచి ఆక్రమణదారులను తరిమి కొట్టింది. తన ధైర్య సాహసాలతో పదాతి దళం పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడానికి జరిగిన గిరిజనుల దాడిని తిప్పి కొట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రక్షించింది.
2022 పదాతి దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతి సేవలో అత్యున్నత త్యాగం చేసిన పదాతి దళానికి చెందిన అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, రెజిమెంట్స్ కల్నల్‌లతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచారు.
Source: Nijamtoday