News

తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

345views

తిరుపతి: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంట‌ల నుంచి భ‌క్తుల‌కు స‌ర్వద‌ర్శనం ప్రారంభ‌మైంది. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉద‌యం ఎనిమిది గంటల 11 నిమిషాలకు ఆల‌య త‌లుపులను మూసివేశారు. దాదాపు 12 గంట‌ల అనంత‌రం రాత్రి ఏడున్నర గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, రాత్రి కైంక‌ర్యాలు నిర్వహించి ఎనిమిదిన్నర గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను తితిదే అనుమతించింది.

అలాగే గ్రహ‌ణం అనంతరం మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును రాత్రి ఏడున్నర గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి చేసిన తర్వాత ఎనిమిదిన్నర గంట‌ల నుంచి భ‌క్తుల‌కు అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. రాష్ట్రంలో మిగిలిన ఆలయాలు కొన్ని తెరుచుకున్నాయి. మరికొన్ని ఆలయాలు నేడు తెరుచుకోనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి