
375views
అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నగరం బాణసంచా పేలుళ్లతో మార్మోగింది. చిన్నాపెద్దా సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు విశాఖలో దీపావళి ఘనంగా జరుపుకున్నారు. బహుళ అంతస్తుల భవనాల వద్ద తిరునాళ్లను తలపించేలా బాణసంచా మోత మోగింది. మహిళలు.. లక్ష్మీపూజ నిర్వహించి.. టపాసులు కాల్చారు. నగరం దీపాల వెలుగుతో కాంతులీనింది. సామూహికంగా పండుగ జరుపుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.







