
348views
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, సెనెటర్ ఛుక్ షుమార్, న్యూయార్క్ లో భారత కాన్సులేటర్ రణధీర్ జైశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ళుగా ఆగిపోయిన ఈ సంబరాలను మరింత ఉత్సాహంతో ప్రారంభించారు. న్యూయార్క్, న్యూజెర్సీ లలోని హిందూ దేవాలయాలలో సహితం దీపావళి సంబరాలు జరుపుతున్నారు. దేశాధ్యక్షుడు బిడెన్, కాంగ్రెస్ సభ్యుల నేతృత్వంలో వారం రోజులపాటు నిర్వహించనున్న పండుగ వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దేశం నలుమూలల నుంచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు.
Source: Nijamtoday





