
ముంబయి: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. అందరికీ 5జీని అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్న జియో తాజాగా ఈ రోజు జియో ట్రూ 5జీ ఆధారిత వై-ఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు.
విద్యాసంస్థలు, మతపరమైన ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య ప్రదేశాలలో తొలుత 5జీ వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. జియో ట్రూ 5జీ సర్వీసులకు ఇది అదనమని తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5జీ సేవలను ప్రారంభించిన జియో వెల్కమ్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. మిగతా నగరాలకు కూడా సేవలను విస్తరించేందుకు జియో కృషి చేస్తోంది. జియో ట్రూ 5జీ పైలట్ బీటా ట్రయల్‌ను చెన్నైతోపాటు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు విస్తరించినట్టు ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
Source: Nijamtoday





