184
భువనేశ్వర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి సంచార లాంచర్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ అస్త్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్దేశించిన రీతిలో పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వర్గాలు తెలిపాయి. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొన్నాయి. ఇందులోని గమనాన్ని రాడార్లు, టెలిమెట్రీ సాధనాలు, బంగాళాఖాతంలో మోహరించిన యుద్ధనౌకలు నిశితంగా పరిశీలించాయని వివరించాయి.