News

శ్రీకాళహస్తి ఆలయానికి తమిళ భక్తుడి కానుక.. నంది విగ్రహానికి 30 కిలోల వెండి తొడుగు

364views

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది విగ్రహానికి చెన్నైకి చెందిన భక్తుడు వెండి కవచాన్ని కానుకగా అందజేశారు. రూ.25లక్షల వ్యయం తో 30కేజీల వెండి కవచాన్ని చెన్నైకి చెందిన జై మురుగన్ బహూకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెండి కవచనానికి పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా మహానంది విగ్రహానికి తొడిగారు. ఆలయం తరఫున దాతలను అధికారులు సత్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి