News

గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు!

369views

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. బ్రేక్ దర్శనం రద్దు చేసినందున 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే దీపావళి ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున.. 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు ఓ ప్రకటనలో తెలిపింది. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనాల భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి