News

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం

397views

బ్రిటన్‌: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహన జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం ‘మహీంద్రా ఎలక్ట్రిక్‌’ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

పార్కులు, నడక మార్గాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్‌కు ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగించనున్నట్టు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ‘ఈ ఆటోల వద్ద పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. పోలీసు సంబంధిత సేవలు లభిస్తాయి. నేరాల నివారణకు సలహాలనూ అందించొచ్చు’ అని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి