News

పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ

506views

కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త దర్యాప్తునకు ఆదేశించింది. సీపీఐ(ఎం) నేతకు ఏజెన్సీ డిసెంబర్ 8న సమన్లు ​​పంపింది. 2020 సంవత్సరంలో చేసిన కొనుగోళ్లలో కిక్‌బ్యాక్‌లు వచ్చాయని కాంగ్రెస్ నాయకురాలు వీణా ఎస్ నాయర్ దావా వేసిన తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వ్యాజ్యం ప్రకారం, కిట్‌లను ఒక్కొక్క యూనిట్ రూ. 1,550కి కొనుగోలు చేశారు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్ ధర కంటే ఇది చాలా ఎక్కువ అని వారు పేర్కొన్నారు. పీపీఈ కిట్‌లతో పాటు గ్లౌజులు, థర్మామీటర్లు, ఆక్సిజన్ మీటర్ల వంటి ఇతర వైద్య పరికరాల కొనుగోలులోనూ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి