News

గంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా విన్నపం

196views

కోల్ కతా: ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండోసారి ఇవ్వకపోవడం పట్ల మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ నుంచి గంగూలీని అన్యాయంగా తప్పించారని ఆమె ఆరోపించారు.

గంగూలీ క్రికెట్ కు, దేశానికి ఎంతో చేశారని.. యావత్‌ దేశానికి ఆయన గర్వకారణమన్నారు. దయచేసి ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌరవ్ గంగూలీని అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని మమత అభ్యర్థించారు. భారత మాజీ కెప్టెన్ బోర్డు చీఫ్ గా గంగూలీ కొనసాగాలని నివేదికలు చెబుతున్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బయటికి వెళిపోయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జే షా బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని.. క్రికెట్ కోసం, క్రీడల కోసం నిర్ణయం తీసుకోండి అంటూ మమతా బెనర్జీ మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈనెల 20న ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్లను స్వీకరించనున్నారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి