
336views
సిల్హెట్: అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంకను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 66 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. 8 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై టీమిండియా జట్టు గెలుపొందింది.
ముఖ్యంగా స్టార్ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మందాన చెలరేగి ఆడింది. కేవలం 25 బంతుల్లో 51 పరుగులు చేసి శెభాష్ అనిపించుకుంది. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో లంక బౌలర్ల దుమ్ముదులిపి నాటౌట్‌గా నిలిచింది. దీంతో కేవలం 8.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఏడోసారి ఆసియా కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది.
Source: Nijamtoday





