News

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. భారత్ ఆందోళన

713views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాలను తక్షణమే విరమించి దౌత్యపర చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దాడుల తీవ్రత పెరగడం ఎవరికీ మంచిది కాదని ఉద్రిక్తతలు తగ్గించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెరగడంపై.. భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోదని ఆయన అన్నారు. అన్ని దేశాల సారభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విధానంలో భారత్‌ స్ధిరంగా ఉంటుందని బాగ్చీ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి