
585views
ఢాకా: బంగ్లాదేశ్‌లోని జెనైదాలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంలోని విగ్రహాలు ముక్కలుగా విరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి పూట గుడిలోకి చొరబడిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారని సుకుమార్ తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌లో 10 రోజుల వార్షిక దుర్గాపూజ ఉత్సవాలు నిమజ్జనంతో ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.
Source: Organiser





