
387views
న్యూఢిల్లీ: భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకత.
ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా రూపొందించాయి. ఢిల్లీ ఆవల తొలిసారి ఐఏఎఫ్ రైజింగ్ డే ఉత్సవాలు జరిగాయి. చండీగఢ్‌లో జరిపిన ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ హాజరయ్యారు.
Source: Nijamtoday





