News

రూ.120 కోట్ల విలువైన డ్రగ్స్​​ స్వాధీనం

366views

ముంబాయి: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ముంబయి గౌడౌన్​లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి