News

దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు!

451views

అలీఘడ్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీకి నాయకురాలు రూబీ అసిఫ్ ఖాన్ తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు.

అంతే… ఇస్లాం మతానికి విరుద్ధంగా దేవి విగ్రహానికి పూజలు చేసిన రూబీ అసిఫ్ ఖాన్ కాఫిర్ అంటూ ఆమెను,ఆమె కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాల కనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు.

రూబీ గత నెలలో వినాయకచవితికి కూడా గణేశ్ విగ్రహాన్ని తన ఇంట్లో ప్రతిష్ఠించి, తర్వాత నరోరా ఘాట్ వద్ద భారీ భద్రత నడుమ నిమజ్జనం చేశారు. రెండేళ్ళ కింద‌ట కూడా రూబీ ఖాన్ తన ఇంట్లో రాం దర్బార్ నిర్వహించారు. గతంలో రూబీకి ఫత్యా జారీ చేశారు. ఈ బెదిరింపులపై రూబీ అసిఫ్ ఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి