News

గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం

326views

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు మూడు గంటల నుంచి పంచ ముఖాలతో కూడిన వేద మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని మంత్రాలకు గాయత్రిదేవి మూలశక్తి అయిన అమ్మ.. ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశిస్తూ సంధ్యా వనదేవతగా పూజలు అందుకుంటున్నారు- గాయత్రిమాత. దశ హాస్తాలతో ఉన్న అమ్మవారిని దర్శించి గాయత్రీ మంత్రం పఠిస్తే మంత్రసిద్ధి ఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి