
353views
న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశామని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. జోన్ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ జోన్ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Source: EtvBharat





