News

కేంద్ర ప్రభుత్వ చర్యలు భేష్‌: ముస్లిం సంస్థలు

276views

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలపై ఐదేళ్ళ‌పాటు విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.

పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో), నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్), జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్), ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్), రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)పై నిషేధం విధించింది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు తీవ్రవాదం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చడం, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని ఎన్‌ఐఏ నిర్దారించింది.

కేంద్ర ప్రభుత్వ చర్యను పలు ముస్లిం సంస్థలు స్వాగతించాయి. ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సహనం ప్రదర్శించాలని కోరారు. అజ్మీర్‌కు చెందిన సయ్యద్ జైనుల్ అబిదీన్ మాట్లాడుతూ, పిఎఫ్‌ఐ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిషేధం విధించబడిందని అన్నారు. ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (MSO), ముస్లిం సూఫీ విద్యార్థుల సంఘం కూడా ఈ చర్యను స్వాగతించింది. PFI తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఒక ప్రకటనలో తెలిపింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి