News

భారత సైన్యం సరికొత్త రణనీతి!

433views

అరుణాచల్‌ ప్రదేశ్‌: చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్‌ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌-ఐబీజీ)గా ఏర్పడటంపై దృష్టిపెట్టింది. దీనివల్ల ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో యుద్ధరీతులే మారిపోతాయి. ఇక్కడ మన సైన్యం చేపడుతున్న మార్పుల్లో ఐబీజీలు ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ దిశగా 2019లో ‘హిమవిజయ్‌’ పేరుతో నిర్వహించిన వినూత్న సైనిక విన్యాసాల్లో నేర్చుకున్న పాఠాలను ఆచరణలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి