News

ఉచిత వైద్య‌శిబిరంలో మ‌హిళ‌ల‌కు చికిత్స‌లు

430views

నంద్యాల‌: నంద్యాల జిల్లా, నంద్యాల పరిసర గ్రామమైన ఎన్.కొత్తపల్లె, శ్రీ శారదా విద్యాపీఠం పాఠ‌శాల‌లో గ్రామీణ మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. సంఘ‌మిత్ర సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వివేకానంద సేవా స‌మితి, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వారు స‌హ‌కారం అందించారు. 120 మందికి ఆరోగ్య త‌నిఖీలు జ‌రిగాయి. అవ‌స‌ర‌మైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

డాక్టర్ వి.హరిత, డాక్టర్ కె.శిల్పా, డాక్టర్ వై.లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ ఎం. శైలజ, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ నర్మద, డాక్టర్ ఎ.శశి, డాక్టర్ ఎస్.వసుధా రాణి, సీనియర్ డాక్టర్ సత్య శివ సుందరి, ఇత‌ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విభాగ్ కార్యకారిణి సదస్యులు డాక్టర్ ఉదయ్ శంకర్, సేవాభారతి ప్రాంత సహసేవాప్రముఖ్ మనోహర్, సంఘమిత్ర అధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. కాగా, ఈ సంద‌ర్భంగా నంద్యాల సక్షమ్ అధ్యక్షుడు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి , సేవా భారతి ప్రాంత సహసేవా ప్రముఖ్ మనోహర్ పాఠశాల ఆవరణలో మొక్క నాటి ఆదర్శమైన ఆనవాయితీని నెలకొల్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి