
603views
-
అడ్డుపడ్డ ఇలియాస్ అనుచరులు
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాస్‌తో పాటు వారి మిత్రుల ఇళ్ళలో సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల కోసం వచ్చిన అధికారులను ఇలియాజ్ బంధువులు, సహచరులు చాలాసేపు అడ్డుకున్నారు. సోదాలు చేయడానికి వీల్లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.





