News

జాతీయ లాజిస్టిక్ పాలసీని ప్రకటించిన ప్రధాని మోడీ

382views

న్యూఢిల్లీ: దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. ‘పీఎం గతిశక్తి’లో భాగంగా మౌలిక వసతుల కొరతను తీరుస్తామని చెప్పారు. దేశీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించేలా వ్యవస్థలను ఆధునికీకరిస్తామని వివరించారు. దేశంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణం పట్ల ప్రపంచ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి