
తమిళనాడు: తమిళనాడులో పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివగంగ జిల్లా, నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర నుంచి విడిపించేందుకు.. వానర సైన్యంతో కలిసి శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరాడు.
మార్గమధ్యంలో తమకు విజయం చేకూరాలని అనేక చోట్ల.. శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్టు పూర్వికుల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రాములవారు.. తమిళనాడు మీదుగా వెళ్ళినప్పుడు.. నానామడై వద్ద ప్రతిష్ఠించిన శివలింగం కాలం సాగుతన్న కొద్దీ భూగర్భంలోకి వెళ్ళిందని.. తాజాగా జరిపిన తవ్వకాల్లో బయటపడిందని వివరించారు. దీంతో అది సాక్షత్తూ రామయ్యతండ్రి పూజించిన లింగంగా భావించి.. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రాముడు నడయాడిన ఈ ప్రాంతంలో మరింత పరిశోధనలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే.. శివలింగం బయల్పడిన చోట గుడి నిర్మాణానికి పూనుకుంటున్నారు.
Source: Tv9





