News

కెనడాలో హిందూ ఆలయం అపవిత్రం

388views

టొరంటో: కెనడా టొరంటోలోని స్వామినారాయణ్​ దేవాలయాన్ని ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను భారత హైకమిషన్​ తీవ్రంగా ఖండించింది. “బీఏపీఎస్​ స్వామినారాయణ్ మందిరంపై కెనడియన్​ ఖలిస్థానీ తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కెనడియన్​ అధికారులకు నివేదించాం” అని హైకమిషన్​ ట్విట్టర్​ ద్వారా తెలిపింది.

కెనడా పార్లమెంట్​ సభ్యుడు చంద్ర ఆర్య ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదొక్కటే కాదు ఇలాంటి మరెన్నో ఘటనలు కెనడాలో జరిగాయి. కెనడాలోని హిందు దేవాలయాలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు” అని అన్నారు. బ్రాంప్టన్​ సౌత్​ పార్లమెంట్​ సభ్యురాలు సోనియా సిద్ధూ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “స్వామినారాయణ్​ మందిరంలో జరిగిన ఘటన విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యా. మనం భిన్న సంస్కృతులు అలవరుచుకునే సమాజంలో జీవిస్తున్నాం. ఈ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ట్వీట్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి