
435views
* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ – వెల్లడించిన రాష్ట్ర మంత్రులు
విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని మానేసర్‌లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మేరుగు నాగార్జున పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని నాగార్జున తెలిపారు.





