News

‘కోహినూర్’ పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్న జగన్నాథ్ సేన

399views

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కిరీటంలో ఉన్న ‘కోహినూర్‌’ వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్‌ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్‌ రాజు రంజిత్‌ సింగ్‌ స్వామికి కోహినూర్ ‌ను కానుకగా ఇస్తానని చెప్పారని, అంతలోనే బ్రిటిష్‌ సైనికులు వజ్రాన్ని కాజేశారని వెల్లడించారు. దీనిపై పూరీ జగన్నాథ సేన అధ్యక్షుడు, న్యాయవాది ప్రియదర్శన్‌ పట్నాయక్‌ సోమవారం రాత్రి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ముని కలిశారు. ‘కోహినూర్‌’పై తాము అంతర్జాతీయ కోర్టుకు వెళతామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.