News

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత యువ క్రీడాకారులు

393views

భారత యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టాప్‌ ర్యాంక్ ‌కు చేరుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్ లో 16వ స్థానంలో నిలిచాడు. వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో (పురుషుల సింగిల్స్‌ విభాగం) ప్రణయ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అంతకముందు 2017 అక్టోబర్ 27న 17 ర్యాంకులో ఉన్నాడు. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ.. “జేయింట్ కిల్లర్​.. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత టాప్ 15 ర్యాంకుల్లోకి వెళ్లబోతున్నాడు” అని ట్వీట్ చేసింది.

మరోవైపు మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రాస్టో జీవితకాలపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రెండు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకులో స్థిరపడ్డారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ 12వ ర్యాంకును సాధించాడు. లక్ష్యసేన్ ఇదే విభాగంలో 9వ ర్యాంకులో స్థిరపడ్డాడు. గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్షిప్, జపాన్ ఓపెన్ కు దూరమైన పీవీ సింధు ఒక ర్యాంకు ఎగబాకి 7వ స్థానంలో ఉంది. మరో ఒలింపిక్ విజేత సైనా నెహ్వాల్ మూడు స్థానాలు మెరుగుపరచుకుని 33వ స్థానానికి చేరింది. పురుఘల డబుల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ 8వ స్థానంలో స్థిరపడ్డారు. మహిళల డబుల్స్ లో అశ్విని బోపన్న, ఎన్ నిక్కిరెడ్డి 28వ స్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమైన ఐదో సీజన్ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌.. డిసెంబర్ 18వ వరకు కొనసాగనుంది. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్…‌ వరల్డ్ టూర్ ‌ను ఐదు విభాగాలుగా విభజించి నిర్వహిస్తోంది. సూపర్‌ -300, సూపర్‌ -500, సూపర్‌-750, సూపర్‌-1000, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్ ఉంటాయి. ప్రతి లెవల్‌లో విజేతలకు వేర్వేరుగా ప్రైజ్ ‌మనీ ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.